స్మార్ట్ ఫోన్ ఎంత ఖరీదైనదయినా బ్యాటరీది దానిలో కీలకపాత్ర. పెద్ద డిస్ ప్లే, నాలుగైదు కెమెరాలు, భారీ ర్యామ్ ఇలా ఎన్ని ఉన్నా అవి నడవడానికి బ్యాటరీ బ్యాకప్ ఉండాల్సిందే. అందుకే ఫోన్ కొనేటప్పుడు వినియోగదారులు బ్యాటరీ కెపాసిటీని చూస్తారు. అందుకే సెల్ ఫోన్ కంపెనీలు కూడా బ్యాటరీ బ్యాకప్ డెవలప్ చేస్తున్నాయ్. బ్యాటరీ సామర్థ్యం (ఎం ఏ హెచ్) పెంచుతూ పోతున్నాయి.
3000 ఎంఏహెచ్ రోజులు పోయాయి
ఒకప్పుడు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే మంచి బ్యాకప్ ఉన్నట్లే లెక్క. ఇప్పుడు ర్యామ్, కెమెరాల సంఖ్య, ఫీచర్లు, డిస్ప్లే అన్నీ పెరగడంతో ఆ బ్యాకప్ సరిపోవడం లేదు. అందుకే కొంతకాలంగా కంపెనీలు 4000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్న ఫోన్లను తీసుకొస్తున్నాయి. మోటరోలా లాంటి కొన్ని కంపెనీలు 5000 ఎంఏహెచ్ బ్యాటరీలున్న ఫోన్లను కూడా రిలీజ్ చేశాయి.
రియల్మీ 6,000 ఎంఏహెచ్ ఫోన్లు
పిల్లలకు ఆన్లైన్ క్లాస్లు, పెద్దవాళ్లకు వర్క్ ఫ్రం హోం, ఆడవాళ్లకు యూట్యూబ్లో వీడియోలు ఇలా స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురకోజుకూ పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు కంపెనీలు 6,000 ఎంఏహెచ్ బ్యాటరీలున్న ఫోన్లను కూడా ప్రవేశపెట్టాయి. రియల్మీ ఇటీవల రిలీజ్ చేసిన రియల్మీ సీ12, రియల్మీ సీ12 మోడల్స్ స్మార్ట్|ఫోన్లలో 6,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీలను అమర్చింది. అంతేకాదు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్నూ తీసుకొచ్చింది. వీటిని 10 వేల లోపు బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి తెచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం51... 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్
ఇక కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ ఈ రేస్ను మరింత ముందుకు తీసుకెళ్లింది. కొత్తగా భారత మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్న శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్|ఫోన్లో ఏకంగా 7వేల ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చబోతోంది. అంటే ఒక్కసారి ఫుల్గా ఛార్జి చేస్తే ఎంత హెవీ యూసేజ్కయినా కనీసం రెండు రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
à°¬à±à°¯à°¾à°Ÿâ€Œà°°à±€ à°¬à±à°¯à°¾à°•‌పà±â€Œ à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°«à±‹à°¨à± à°¬à±à°¯à°¾à°Ÿâ€Œà°°à±€ à°¬à±à°¯à°¾à°•‌పà±â€Œ రియ‌లà±â€Œà°®à±€ 6000 à°Žà°‚à°à°¹à±†à°šà± ఫోనà±à°²à± శాంసంగౠ7 000 à°Žà°‚à°à°¹à±†à°šà± à°¬à±à°¯à°¾à°Ÿâ€Œà°°à±€ ఫోనà±â€Œ Samsung 7000 mah battery smart phone smart phone battery back up